Natyam ad

రాష్ట్రపతి పర్యటనకు భద్రాతా ఏర్పాట్లు

గన్నవరం ముచ్చట్లు:


గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి పర్యటన భద్రతా ఏర్పాట్లు, పోరంకిలో సివిక్ రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాట్లు  జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమీక్షించారు. భారత రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు.
భారత రాష్ట్రపతి రాష్ట్రానికి మొదటిసారి రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4వ తేదీ పోరంకి మురళి రిసార్ట్స్లో సివిక్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ఈనెల 4వ తేదీ ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఈ సందర్భంగా  విమానాశ్రయంలో కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లు పరిశీలించారు. గ్రీన్ రూమ్లో చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రోటోకాల్ నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. ఎయిర్పోర్ట్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఆర్టీపిసిఆర్ టెస్టులు నిర్వహించుటకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఫైర్ సేఫ్టీ నిబంధనలు మేరకు చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమం విజయవంతం గావించాలని కలెక్టర్ ఆదేశించారు.

 

జిల్లా ఎస్పీ పి జాషువా మాట్లాడుతూ భారత రాష్ట్రపతి మొదటిసారి జిల్లాకు వస్తున్నారని షెడ్యూల్ ప్రకారం కార్యక్రమ నిర్వహణకు అని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు, షెడ్యూల్ ప్రకారం ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గాడ్ ఆఫ్ హానర్, నేషనల్ యాంతం పోలీస్ బ్యాండ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సివిక్ రిసెప్షన్ కార్యక్రమం ఆహ్వానితులు గంట ముందుగా వెన్యూ చేరుకునే విధంగా సూచించాలన్నారు. వెన్యూ వద్ద ఆహ్వాన పత్రికలే ఎంట్రీ పాసులుగా పరిగణిస్తారన్నారు.
ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓ ఎస్ డి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎయిర్  పోర్ట్ లో బ్లూ బుక్ నిబంధనలు అనుసరించాలని, ముందుగా రన్ వే చెక్ చేసుకోవాలని సూచించారు. ఫ్యూయల్, చెకిండ్  గిఫ్ట్స్,  గార్లాండ్ తనిఖీలు చేయాలన్నారు.తరువాత జిల్లా కలెక్టర్ ఎస్పీ, జేసీ లతో కలిసి పోరంకి మురళి గార్డెన్స్ లో సివిక్ రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు.
ఏలూరు జిల్లా ఎస్ పి రాహుల్దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్య రెడ్డి, ఎస్కార్ట్ అధికారి మేరీ ప్రశాంతి, ఎయిర్ పోర్ట్ అధికారులు లక్ష్మీకాంతరెడ్డి, రామారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Security arrangements for the President’s visit

Post Midle