సిటీ ఉద్యోగులకు భద్రత కరువు

Date:22/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఎండ, వాన, చలి, రాత్రి, పగలు తేడా లేకుండా వారు పనిచేస్తారు. ఎక్కడ విద్యుత్‌ సమస్య వచ్చినా అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారమయ్యే వరకు శ్రమిస్తారు. ఇంత చేసినా వారి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. వారే విద్యుత్‌ శాఖలో ఏ సమస్య వచ్చినా నిరంతరం శ్రమించే కాంట్రాక్ట్‌ కార్మికులు. ప్రభుత్వానికి ఆదాయం తప్ప మరేమీ కన్పించడం లేదు. సెక్షన్‌లో ఎన్ని సర్వీసులుండాలి? ఎన్ని వున్నాయి? ఎంత మంది ఓ అండ్‌ ఎం ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులున్నారనే దానితో సంబంధం లేకుండా పని భారం మోపుతున్నారు. పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలను మన కార్మికులు పోయి బిల్లులు కట్టండని వత్తిడి చేస్తే చాలు వెంటనే దాడులకు పాల్పడుతున్నారు. . తగినంత సిబ్బంది లేకపోవడంతో పది మంది చేసే పని ఒక్కరే చేయాల్సి వస్తోంది. దీంతో నిత్యం 8 గంటలు కాదు, దాదాపు 12 గంటల పాటు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఇది వారి శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.

 

 

 

 

 

ఈ క్రమంలో విద్యుత్‌ స్తంభాలపై పనిచేస్తున్న సమయంలో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాల బారిన పడి మృతి చెందాల్సి వస్తోంది.ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. పెరిగిన సర్వీసులకనుగుణంగా పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య పెంచటం లేదు. కాంట్రాక్ట్‌ అనే ముద్దు పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అనే చట్టాన్ని తుంగలో తొక్కి ప్రమాదకరమైన పనులను కాంట్రాక్ట్‌ కార్మికులతో చేయిస్తున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వాలని సుఫ్రీకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడ

 

20 పంచాయితీల్లో నీటి కష్టాలు

Tags: Security for City employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *