ఎన్నికలకు పకడ్బంది భద్రత

Security for the elections

Security for the elections

Date:06/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసాం. సుమారు లక్ష మంది తో ఎన్నికల భద్రత ను ఏర్పాటు చేసాం. రాష్ట్రంలో  50 వేల మంది తో భద్రత కల్పిస్తున్నట్లు అడిషనల్ డీజీ జితేందర్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోసం 414 ఫ్లయింగ్ స్కాడ్లు, 404 ఎస్ ఎస్ టీం లు, 3.385 సంచార బృందాలు ఏర్పాటు చేసామని అన్నారు. 279 కేంద్ర కంపెనీలు బలగాల తో భద్రత కల్పిస్తున్నాం.
ప్రధాన ఎన్నికల అధికారుల ఆదేశాల కు అనుగుణంగా భద్రత నిర్వహించాం. ఇప్పటి వరకు 25 కోట్లు డబ్బు సీజ్ చేసాం. 4 లక్షల లీటర్ల లిక్కర్ సీజ్ చేసామిన వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసాం. 6 రాష్ట్రాల మధ్యప్రదేశ్,బీహార్,ఒరిస్సా,మహారాష్ట్ర కర్ణాటక, పోలీసులు వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి 20 వేల మంది బలగాలు తో భద్రత వుంటుంది. తెలంగాణ లో మావోయిస్టుల ప్రభావం లేదు. అయిన కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉన్నామన్నారు.
మహారాష్ట్ర,చత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసాం. 4 వేల కు పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. మావోయిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం. కొడంగల్ రేవంత్ రెడ్డి  అరెస్ట్ కోర్ట్ పరిధిలో ఉంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో  మాట్లాడలేనని అన్నారు. ప్రతి ఏరియా లో చెక్ పోస్టుల ను ఏర్పాటు చేసాం. కుంబింగ్ ఆపరేషన్ కోసం స్పెషల్ టీం లను ఏర్పాటు చేసాం. ప్రజలందరూ ప్రశాంతంగా ఓటు  హక్కును వినియోగించుకోవాలని అయన సూచించారు.
టిడిపి నేత  జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి ఆనంద్ ప్రసాద్,  సంగారెడ్డి  జగ్గారెడ్డి, మేడ్చల్ మల్లా రెడ్డి,  కంటోన్మెంట్ సర్వే సత్యనారాయణ పై  కేసులు నమోదు చేసామని అయన అన్నారు.
Tags:Security for the elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *