అభివృద్ధి చూసి ఓట్లు వేయండి-చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఓట్లు వేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం చెంగలాపురం రోడ్డు, తూర్పుమొగశాల , 4వ సచివాలయంలో డిజిటల్‌ బోర్డును కమిషనర్‌ నరసింహప్రసాద్‌, చైర్మన్‌ అలీమ్‌బాషా కలసి ఆవిష్కరించారు. వార్డులలో చైర్మన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మా నమ్మకం నువ్వే జగన్‌ బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి జనాభిప్రాయ సేకరణ చేపట్టారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆదేశాల మేరకు పట్టణంలోని పేదలందరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. పట్టణంలో మౌళిక వసతులు ఏర్పాటు చేసి, ఆదర్శ పట్టణంగా మార్పు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పార్టీ పట్టణ అధ్యక్షుడు జయరాం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత , కన్వీనర్‌ వరదారెడ్డి తో పాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post Midle

Tags: See the development and vote – Chairman Aleembasha

Post Midle