సీడ్స్ కంపెనీలపై ఫర్టిలైజర్స్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి-సీపీఐ నాయకుల డిమాండ్

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల జిల్లా కేంద్రంలో సోమవారం నాడు సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాల మాఫియా ద్వారా నష్టపోయిన జిల్లా రైతాంగాన్ని ఆదుకోకపోతే ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ  జిల్లా కార్యదర్శి రాంగనాయుడు ,జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ సీడ్స్ విత్తనాలు, నకిలీ నీళ్ల మందులు సరఫరా చేస్తున్న సీడ్స్ కంపెనీల,ఫర్టిలైజర్స్  షాపు యజమానులపైన కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎఐ వై ప్.నం ద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు,ఎఐయస్ ప్ . నంద్యాల జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శ్రీనివాలుసు,ధనుంజయుడు, ఆఫీస్ బేరర్స్ ప్రతాప్,సురేష్, నంద్యాల పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు విష్ణు,శశి,జిల్లా సహాయ కార్యదర్శి రవి,ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్,మరియు డోన్ సీపీఐ ప్రజా సంఘాల నాయకులు,బనగానపల్లె సీపీఐ ప్రజా సంఘాల నాయకులు,నంద్యాల పట్టణ ప్రజా సంఘాల నాయకులు,గోస్పాడు సీపీఐ నాయకులు,మహానంది సీపీఐ నాయకులు,నందికొట్కూరు సీపీఐ ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Tags: Seed companies should take strict action against fertilizer shops-CPI leaders demand

Leave A Reply

Your email address will not be published.