అన్నదాతకు విత్తన కష్టాలు (తెలంగాణ)

Seed difficulties for suppathy (Telangana)

Seed difficulties for suppathy (Telangana)

 Date:12/07/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అరకొర వర్షాలతో సతమతమవుతున్న అన్నదాతలను వరివిత్తనాల కొరత వేధిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల్లో నిల్వలు నిండుకోవడంతో రైతు లు ప్రైవేట్‌ విత్తన వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఒక్కో విత్తన బస్తాపై రూ.300 నుంచి రూ.400 అదనంగా వసూలు చేస్తున్నారు. ఖరీప్ లో రాష్ట్రవ్యాప్తంగా 23,75,080 ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ వద్ద లెక్కలున్నాయి. సాధారణంగా జూన్‌ చివరి వారం, జూలై మొదటి వారంలో నార్లు ఎక్కువగా పోస్తారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలంగా పడకపోవడంతో వరి నారు ప్రక్రియ మందకొడిగా మొదలైంది. పక్షం రోజుల వ్యవధిలో సుమారు లక్ష ఎకరాలకు సరిపడా రైతులు నార్లు పోశారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరి నార్లు పోయటానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో క్షేత్రస్థాయిలో పీఏసీఎస్ లకు వచ్చిన విత్తనాలు రెండు రోజుల్లోనే అమ్ము డు పోయా యి. ఖరీఫ్‌ సీజన్‌లో 2,83,955 క్విం టాళ్ల వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.ఇప్పటివరకు 1,74,174 క్వింటాళ్లను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పంపించింది. వీటిలో శుక్రవారం నాటికి 1,27,318 క్వింటాళ్లను రైతులు కొనుగోలు చేశారు. సహకార సంఘాల్లో ఎంటీయూ-1001 రకం విత్తనాలు రూ.680, ఆర్‌ఎన్‌ఆర్‌ రకం విత్తనాలు రూ.305, బీపీటీ విత్తనాలు రూ.625 చొప్పున విక్రయిస్తున్నారు. పీఏసీఎ్‌సల్లో విత్తనాలు అందుబాటులో లేకపోవటంతో రైతులు బహిరంగ మార్కెట్‌కు పరుగులు పెడుతున్నారు. దీంతో వ్యాపారులు ఒక్కో విత్తన బస్తాను రూ.850 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు కళ్లెం వేయాలంటే పీఏసీఎ్‌సల్లో విత్తనాలు అందుబాటులో ఉంచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖరీఫ్‌ సీజన్‌లో దొడ్డురకం వరిసాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. నిరుడు సన్నరకం సాగుచేసిన రైతులు నష్టపోయారు. ఎకరా కు 35నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా… 20 నుంచి 25 బస్తాలు మాత్రమే వచ్చింది. పెట్టుబడి ఖర్చు కూడా దొడ్డు ర కంతో పోలిస్తే నాలుగైదు వేలు ఎక్కువే . ఈ నేపథ్యంలో సన్న రకం కంటే దొడ్డు రకం సాగు చేయటమే మేలని రైతులు భావిస్తున్నారు. దీంతో ఈ రకం విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది.
అన్నదాతకు విత్తన కష్టాలు (తెలంగాణ) https://www.telugumuchatlu.com/seed-difficulties-for-suppathy-telangana/
Tags:Seed difficulties for suppathy (Telangana)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *