రైతులకు సబ్సిడిపై విత్తనాలు

Date:18/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని రైతులకు సబ్సిడి ధరలపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఏవో సంధ్య గురువారం తెలిపారు. రాగులు కిలో ధర రూ.60లు కాగా, రూ.25లు సబ్సిడితో పంపిణీ చేస్తామన్నారు. అలాగే జింక్‌ సల్ఫేట్‌ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. అవసరమైన రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకము, ఆధార్‌కార్డుతో బయోమెట్రిక్‌ విధానంలో పొందాలని సూచించారు. శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.

వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు

Tags: Seeds on subsidy to farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *