సాగుకు మొగ్గుచూపుతున్నారోచ్

Date:03/03/2018
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
పంటల సాగుకు 24 గంటలు విద్యుత్తు సరఫరా.. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేత.. రానున్న రోజుల్లో ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి(ఖరీఫ్‌, రబీ) పంపిణీ..  వంటి పథకాలు, చర్యలు వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చేవే. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఆరుగాలం శ్రమించి పండించిన పంటను వ్యయప్రయాసలకు గురవుతూ రైతులు మార్కెట్లకు తీసుకొస్తే మద్దతు ధర లేక.. దళారులు, వ్యాపారుల చేతిలో దగా పడుతూ నష్టపోతున్నారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతున్నా.. కర్షకుడు కష్టించి పండించే పంటకు గిట్టుబాటు ధర అటుంచి.. కనీసం మద్దతు ధర అందడం లేదు. ఈ సమస్యను అధిగమించేలా పాలకులు చొరవ చూపితే రైతు దర్జాగా వ్యవసాయం వైపు మొగ్గుచూపునున్నారు.ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులు వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తారు. దీనికితోడు గత మూడున్నరేళ్లలో ఉభయ జిల్లాలో సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి తోడు మిషన్‌ కాకతీయ పనుల కారణంగా పలు చెరువులు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. సాగర్‌ నీళ్లు కూడా పలు దఫాలుగా గత రెండేళ్లుగా విడుదలవుతున్నాయి. ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ, కొత్త పథకాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేయడంతో ఖమ్మం జిల్లాలో భూగర్భజలాలు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పరిస్థితి  నెలకొంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మిషన్‌ భగీరథ పనుల్లో పడి.. నిధులు లేని సీపీడబ్ల్యూ తాగునీటి పథకాలను వదిలేశారు.పీడబ్ల్యూ తాగునీటి పథకాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ విభాగం నిర్మించగా వాటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 12, 13 ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్‌లకు ఇచ్చేది. జిల్లా పరిషత్‌లు ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగానికి నిధులు అందించడంతో ఆ విభాగం నిర్వహించేది. వీటి నిర్వహణకు ఏటా టెండర్లు నిర్వహించి గుత్తేదారులను ఖరారు చేసేవారు. వాళ్లు తమ వద్ద కాంట్రాక్టు కార్మికులను నియమించి ఈ పథకాలను నిర్వహించేవారు. ప్రతి నెల ఇచ్చే బిల్లుల మేరకు గుత్తేదారులు కార్మికులకు జీతాలు చెల్లించడంతోపాటు, విద్యుత్తు బిల్లులు చెల్లించేవారు. 2014 ఏప్రిల్‌ నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం జడ్పీలకు ఇవ్వకుండా నిలిపేసింది. జనాభా లెక్కల ఆధారంగా నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తోంది. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు ఖర్చు చేసేందుకు పంచాయతీలకు పలు నిబంధనలు విధించారు. తాజాగా తాగునీటి అవసరాలకు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 10 శాతం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు సీపీడబ్ల్యూ తాగునీటి పథకాలు లేవు. ఈ పథకాలు కలిగిన గ్రామాల నుంచి 10 శాతం నిధులు సేకరించి సీపీడబ్ల్యూ తాగునీటి పథకాలు నిర్వహించడం అసాధ్యంగా మారింది. సర్పంచులు తాము నిధులు ఇవ్వమని మొండికేస్తున్నారు. 2014 ఏప్రిల్‌ నుంచి ఈ పథకాల నిర్వహణకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు టెండర్లు నిర్వహించడంలేదు. గుత్తేదారులకే నిర్వహణ పనులు కేటాయిస్తున్నా.. వారికి నిధుల లభ్యత లేక ఆ బాధ్యతను కాంట్రాక్టు కార్మికులకే వదిలేసినట్లు సమాచారం.
Tags: Seeking for cultivation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *