నిరుపేదలకు సీయం సహయ నిధి  కొండ అంత అండ

శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా కేంద్రంలో శనివారం నాడు నంద్యాల నియోజకవర్గంలోని 12 మంది కి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి   ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుపేదలు ఉన్నారని వారి కోసం దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఎంతోమంది పేద కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. తండ్రి బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతోందన్నారు . నంద్యాల నియోజకవర్గంలో ఉన్న నిరు పేదలకు సీయం పండ్సు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Tags: Seem Sahay Fund for the poor is as big as a hill

Leave A Reply

Your email address will not be published.