ద్రౌపదీ కి ఓటు వేసిన సీతక్క

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతున్నది. శాసనసభలోని కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటువేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క వంతు వచ్చింది. ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్‌పేపర్‌పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్‌ చేశారు. గ్రహించిన ఆమె తాను పొరపాటున ఓటు వేశానని, మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వాలని ప్రిసైడింగ్‌ అధికారులను కోరారు.అయితే నిబంధనల ప్రకారం మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌ను డ్రాప్‌ బాక్స్‌లో వేయకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారుల తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే.కాగా, ఇప్పటివరకు 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా ఇక్కడే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు..

 

 

అసలేం జరిగిందంటే
రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా తన ఓటును వేయడం కోసం పొలింగ్ సెంటర్‌కు వచ్చారు ఎమ్మెల్యే సీతక్క. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ ఇవ్వగా.. దానిపై మార్క్ చేసేందుకు అధికారులు ఇచ్చిన పెన్‌ను ఓపెన్ చేశారు. అయితే, ఇంక్ పొరపాటున బ్యాలెట్ పేపర్‌పై పడింది. దాంతో తన ఓటు వృధా అవుతుందేమోనని భావించిన ఎమ్మెల్యే సీతక్క.. విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలియజేశారు. మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరారు. అయితే, అధికారులు మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ఆ బ్యాలెట్ పేపర్‌పైనే తన ఓటు వేసి, బ్యాలెట్ బాక్సులో వేశారు. ఇదే విషయాన్ని ఓటు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు ఎమ్మెల్యే సీతక్క.ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్‌పై పడింది. దాంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపరే బాక్స్‌లో వేశాను. నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి.’’ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాగా, ఎమ్మెల్యే సీతక్క వేసిన ఓటు చెల్లుతుందా? లేదా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి.

 

Tags: Seethakka voted for Draupadi

Leave A Reply

Your email address will not be published.