సీతూ పాప మాములగా లేదుగా

హైదరాబాద్   ముచ్చట్లు :

 

 

సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడే సితార సోషల్ మీడియాను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇన్ స్టా, యూట్యూబ్‌లో సితార దూసుకుపోతోన్నారు. ఇక సితారను మహేష్ బాబు సీతూ పాప అని ముద్దుగా పిలుస్తుంటారు. అలానే అభిమానులు కూడా పిలుస్తుంటారు. ఇక సితార కొత్త కొత్త వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఇక సితార ఆద్య అంటూ మొదలుపెట్టిన యూట్యూబ్‌లో ఈ ఇద్దరూ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఆ మధ్య ఈ ఇద్దరూ కలిసి ఏకంగా మహేష్ బాబునే ఇంటర్వ్యూ చేసేశారు.అలా సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సితార షేర్ చేసే వీడియోలు, మాట్లాడే మాటలు, చేసే పనులు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. మహేష్ బాబు, గౌతమ్‌లతో తాను చేసే అల్లరి గురించి చెబుతుంటారు. స్విమ్మింగ్ పోటీలు, ఆటల పోటీలు, తన కోసం మహేష్ బాబు చేసే పనుల గురించి సితార ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తనను నవ్వించేందుకు తన తండ్రి ఎలాంటి పనులు చేస్తారో కూడా చెబుతుంటారు.ఇక రెండ్రోజుల క్రితమే తన తండ్రి ఒళ్లో సితార పడుకున్న ఫోటో తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు సితార తన బెడ్ మీద అలా వాలి పడుకున్నారు. అయితే నిద్రపోయే ముందు, నిద్రలో తన అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. మనకు కలలు కనడమనేది ఎంతో ముఖ్యం.. మరీ ముఖ్యంగా నాకు. ప్రతీ రోజూ ఎన్నో కొత్త ఐడియాలతో నిద్ర లేస్తాను.. ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయాలని మా అమ్మ నాకు నేర్పింది. అలా చేస్తాను కాబట్టే.. ఇలాంటి కొత్త ఐడియాలు వస్తాయ్.. మంచి నిద్ర పడుతుంది అని సితార చెప్పుకొచ్చారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Seethu sins are not normal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *