మంత్రి అల్లోలకు నిరసన సెగ
యాదాద్రి ముచ్చట్లు:
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చిన మంత్రి ని కొండపైన వ్యాపార సంఘం సభ్యులు అడ్డుకున్నారు. . స్వామివారి దర్శనం అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయీని కొండపై ఉన్న ఈఓ కార్యాలయం ముందు గంట పాటు వర్తక సంఘం సభ్యులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని, కొండపైన కూడా దుకాణాలు కేటాయించాలని వర్తకులు మంత్రిని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెండు రోజుల్లో సీఎంతో చర్చించి కొండపైనే దుకాణాలు ఏర్పాటు చేసే విషయం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వర్తక సంఘసభ్యులు ఆందోళన విరమించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Sega protests against Minister Allola