Date:21/01/2021
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కయాంజల్ లో హెచ్కేజీఎన్ పార్క్ లో అక్రంగా లారీలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, అక్రమంగా డీజిల్ ట్యాంక్ నుండి డీజిల్ ను తీస్తున్న వాటి పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు పదిహేను టన్నుల వరకు రేషన్ బియ్యం, సుమారుగా 100 లీటర్ల డీజిల్ ను గుర్తించారు. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకొని శివారు ప్రాంతాలైన ఉప్పల్, కీసర, రామాంతపర్ , ఘట్కేసర్ లలోని పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే కూలీలకు ఎక్కువ ధరకు అమ్ముతున్న వెంకటేశ్వర రావు, కృష్ణ ల పై కేసు నమోదు చేసారు.
పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన
Tags: Seized ration rice