వాహనం సహా రూ 17 లక్షల విలువచేసే ఎర్రచందనం స్వాధీనం నలుగురు అరెస్టు

పీలేరు  ముచ్చట్లు:

అశోక్ లైలాండ్ లగేజీ వాహనం సహా 17 లక్షల విలువచేసే 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం పరుచుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు పీలేరు రూరల్ సిఐ మురళీకృష్ణ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి రొంపిచర్ల మండలం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్ర వారి పాలెం మండలం ఉదయ మాణిక్యం నుండి పల్సర్ ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు ట్రిపుల్ రైడింగ్ గా వస్తూ  ఉండి పోలీసులను చూసి తమ వాహనాన్ని వెనక్కు తిప్పుకునే ఈ సమయంలో అదుపుతప్పి కింద పడ్డారు. వారికి సహాయం చేసేందుకు వెళుతున్న పోలీసులను చూసి పారిపోతుండగా ఇరువురిని పట్టుకున్నామన్నారు. ఇంతలో అదే మార్గంలో వచ్చిన అశోక్ లైలాండ్ లగేజ్ వాహనం దారుడు సైతం తన వాహనాన్ని ఆపి పారిపోయాడు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా టమోటా ఖాళీ ట్రేల కింద 9 ఎర్రచందనం దుంగలను కనుగొని అందులో ప్రయాణిస్తున్న మరో ఇరువురిని  అదుపులో కి తీసుకొని విచారించగా, శేషాచలం అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం దుంగలను కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి వాహనం సహా ఎర్రచందనం దుంగలను స్వాధీన పరచుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో రొంపిచర్ల ఎస్ ఐ హరి ప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,,

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Seized red sandalwood worth Rs 17 lakh including vehicle
Four arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *