భారీ సంఖ్యలో ట్రాక్టర్ల సీజ్

నల్గోండ  ముచ్చట్లు:
నల్గొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం కొప్పోలు గ్రామాల మూసీ పరివాహక ప్రాంతాలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 55 ట్రాక్టర్లను నల్గొండ జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు సీజ్ చేసి కేతేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.. ఇంకా సీజ్ చేయనున్న ట్రాక్టర్ల సంఖ్య పోలీసుల ఎంక్వయిరీ లో క్రమక్రమంగా పెరుగుతుండటంతో.. పోలీస్ స్టేషన్ ఆవరణ సరిపోకపోవడంతో తో పోలీస్ స్టేషన్ పక్కనే ఒక ఎకరా స్థలాన్ని పోలీసులు లీజ్ తీసుకొని ట్రాక్టర్ అన్నింటిని అక్కడికి తరలించారు.. ఇక సీజ్ అయిన ట్రాక్టర్లు అన్ని ఒకే కంపెనీకి చెందిన స్వరాజ్ ట్రాక్టర్లు కావటం గమనార్హం.. ఒకే కంపెనీకి చెందిన ట్రాక్టర్లు ఒక్కసారిగా పోలీసులు సీజ్ చేయడంతో వరుస క్రమంలో ఉన్న ట్రాక్టర్లతో ట్రాక్టర్ల షోరూమ్ నీ తలపించింది.
ఇక సీజ్ చేసిన ట్రాక్టర్లను అన్నింటిని కోర్టులో డిపాజిట్ చేస్తున్నామని.. ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేస్తున్నామని , భీమారం కొప్పోలు  గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పకడ్బందీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని.. ఈ ప్రాంతాలలోని మూసి పరివాహక ప్రాంతాలలో ఎవ్వరు ఇసుక అక్రమ రవాణా కు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇప్పుడు కేసులు నమోదు అయిన ట్రాక్టర్లు మరో ఐదు సంవత్సరాల లోపు పట్టుబడితే మూడు లక్షల రూపాయలను చెల్లించే ఈ విధంగా పూచికత్తు తో  రెవెన్యూ అధికారుల ముందు బైండోవర్ చేసినట్లు శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. ఎన్ .డి ప్రసాద్ తెలిపారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Seizure of a large number of tractors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *