Natyam ad

పుంగనూరులో రేషన్‌బియ్యం స్వాధీనం

పుంగనూరు ముచ్చట్లు:

అక్రమంగా కర్నాటకాకు తరలుతున్న సుమారు నాలుగుటన్నుల రేషన్‌బియ్యంను సోమవారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె నుంచి ఐచర్‌ల్యారీలో నాలుగు టన్నుల బియ్యాన్ని తీసుకుని మండలంలోని పట్రపల్లె మీదుగా కర్నాటక బార్డర్‌కు వెళ్తున్న లారీ రోడ్డు పక్కన అదుపుతప్పి ఇరుకుపోయింది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో సీఐ గంగిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు జెసిబితో లారీని బయటకు తీసి బియ్యంను, లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పరారైయ్యారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: Seizure of ration rice in Punganur

 

Post Midle