Natyam ad

రేషన్ బియ్యం పట్టివేత

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు నందు సుమారు 15 టన్నుల రేషన్ బియ్యంను తిరుపతి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  రహస్య సమాచారం మేరకు  బొలెరో వాహనం లో నుండి 16 చక్రాల లారీ లోకి బియ్యంను లోడ్ చేస్తుండగా  అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  లారీ బొలెరో వాహనం తో పాటు  ఒకడ్రైవర్ ను మరియు ఒక కూలిని  పట్టుకోవడం జరిగిందని, తమ ఉన్నతాధికారులు వచ్చిన అనంతరం దర్యాప్తు చేపట్టి  పూర్తివివరాలు  తెలియజేస్తామని విజిలెన్స్ సిఐ సాయి దీపక్ తెలిపారు.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Seizure of ration rice