వాహనాల తనిఖీల్లో బాగంగా ఎటువంటి ఆధారాలు లేని రూ.3,39,500 నగదు పట్టివేత

రాయచోటి ముచ్చట్లు:

 

ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు రాయచోటి డిఎస్పీ మహబూబ్ బాషా,అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి పట్టణం కడప రోడ్డు మార్గంలోని లక్ష్మిహాల్ ఎదురుగా గురువారం ఎస్సై జయరాములు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో బాగంగా అమానుల్లా అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్ళుతున్న రూ.3 లక్షల 39 వేల 500 లు నగదును స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న నగదును అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సీజ్ చేసి ట్రెజరికి అప్పగించినట్లు ఎస్సై జయరాములు తెలిపారు. ప్రజలు ఎవరైనా అత్యవస పరిస్థితుల్లో కానీ,ఇతర అవసరాల నిమిత్తం కానీ రూ.50 వేలకు మించి ఉన్నట్లయితే తగిన ఆధారాలతో నగదును తీసుకువెళ్ళవచ్చుననీ తెలిపారు.ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Seizure of Rs.3,39,500 cash without any evidence during vehicle inspections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *