విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు

Seldom sell plastic covers

Seldom sell plastic covers

– తూతూ మంత్రంగా జరిమానాలు
– ప్లాస్టిక్‌ నిషేధానికి తూట్లు

Date:25/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినా వ్యాపారుల్లో మార్పురాకపోవడంతో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు, వినియోగం ఊపందుకుంది. మున్సిపాలిటి జరిమానాలు నామమాత్రం కావడంతో ప్లాస్టిక్‌ నిష్యేధం ఆదిలోనే హంసపాదు అన్నచందంగా తయారైంది. ఆదివారం పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ కలసి పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో సుమారు 15 కేజిల ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. 15 షాపులు, 69 మటన్‌షాపులు, కూరగాయల షాపులు, పూల వ్యాపారుల వద్ద దాడులు చేశారు. ప్రతిచోటా ప్లాస్టిక్‌ కవర్లు నియోగిస్తూ అధికారులకు చిక్కారు. ఈ మేరకు షాపు యజమానులకు జరిమానాలు విధించారు. గత రెండు సంవత్సరాల నుంచి పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేధించారు. కానీ జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా ప్రకటించారు. ఇలాంటి తరుణంలో పుంగనూరులో ప్లాస్టిక్‌ కవర్లు వినియోగం తీవ్రం కావడం అధికారులను కలవరపరుస్తోంది. అధికారుల జరిమానాలు నామమాత్రంకావడంతో ప్లాస్టిక్‌ విక్రయాలు తీవ్రమౌతోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ పట్టణంలో అవగాహన సదస్సులు కల్పించి, ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధిస్తూ చర్యలు చేపట్టామన్నారు. కొంత మంది స్వార్థ పరులు రహస్యంగా వినియోగం చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రతి రోజు దాడులు నిర్వహించి, షాపు యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, షాపు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో మేలు నాగయ్య, హరి, మురళి, వెంకట్రమణ, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

రహస్య విక్రయాలు…

మున్సిపాలిటి సమావేశాలకు హాజరౌతున్న కొంత మంది వ్యాపారులు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌. వర్మ వద్ద ప్లాస్టిక్‌ నిషేధం గూర్చి డాంబికాలు చెబుతూ దర్జాగా ప్లాస్టిక్‌ విక్రయిస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కమిషనర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బాలిక అదృశ్యం

Tags: Seldom sell plastic covers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *