ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీల లబ్ధిదారుల ఎంపిక

Selection of beneficiaries of SC, ST, BC and minority

Selection of beneficiaries of SC, ST, BC and minority

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం, మున్సిపాలిటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, క్రిష్టియన్‌, కాపు, ఆర్యవైశ్య కులాలకు చెందిన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, కమిషనర్‌ కెఎల్‌.వర్మ విడివిడిగా నిర్వహించారు. మంగళవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 701 మంది లబ్ధిదారులు ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 356 మంది హాజరైయ్యారు. అలాగే మున్సిపాలిటిలో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే 20న ఎస్టీ, బీసీ, క్రిష్టియన్‌ , మైనార్టీ, కాపులకు , ఆర్యవైశ్యులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఇతర కులస్తులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమానికి వివిధ బ్యాంకుల అధికారులు హాజరైయ్యారు.

ఆర్‌వో ప్లాంట్లపై తనిఖీ

Tags: Selection of beneficiaries of SC, ST, BC and minority

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *