Natyam ad

పుంగనూరులో క్రీకెట్‌ జట్ల ఎంపిక

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ క్రీకెట్‌ జట్లను ఎంపిక చేసినట్లు పీడీ రామచంద్ర తెలిపారు. సోమవారం స్థానిక శుభారాం డిగ్రీ కళాశాలలో జట్ల ఎంపిక కార్యక్రమాన్ని విశ్రాంత డీఎస్పీ సుకుమార్‌బాబు, జాతీయ క్రీడాకారుడు నానబాలగణేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సెలక్షన్‌ కమిటి ప్రభాకర్‌, చంద్రకుమార్‌ , శ్రీనివాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి జట్లతో నగిరిలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌, పీడీలు వెంకటేష్‌, చంద్రశేఖర్‌, తులసిరామిరెడ్డి, వంశీకృష్ణ, నితీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Selection of cricket teams in Punganur

Post Midle