చౌడేపల్లెలో అండర్ 14 వాలీబాల్ జట్టు ఎంపిక
చౌడేపల్లె ముచ్చట్లు:
అండర్ -14 స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ నియోజకర్గ స్థాయి వాలీబాల్ జట్టును ఎంపికచేసినట్లు హెచ్‌ఎం వేణుగోపాల్ తెలిపారు. గురువారం ఏ.కొత్తకోట ఉన్నతపాఠశాల క్రీడా ప్రాంగణంలో మండలస్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు నియోజక వర్గపు స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడా కారులు బాలురు15మంది, బాలికలు 15మంది క్రీడా జట్టును ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరు గంగాధర నెల్లూరు మండలం నెల్లే పల్లి ఉన్నత పాఠశాలలో ఈనెల 30వతేది నిర్వహించబోయే జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో పుంగనూరు నియోజకవర్గంనుంచి పోటీల్లో తలపడనున్నట్లు పిడీ ఉమాదేవి తెలిపారు. ఈ పోటీలకు పుంగనూరు, చౌడేపల్లె,సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్ల , మండలాలనుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు నితిన్, చిన్నప్ప, శారద, ఆమని, మధురిమ తదితరులు పాల్గొన్నారు.

Tags: Selection of under 14 volleyball team in Chaudepalle
