Natyam ad

సెల్ఫీ ఆత్మహత్యాయత్నం

హనుమకొండ ముచ్చట్లు:


హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పొన్నాల అజయ్ రెడ్డి అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న దృశ్యాలను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం కలకలం రేపింది. వారసత్వంగా కాస్తూ మీద ఉన్న తనకు రావల్సిన 23 న్నర గుంటల భూమిని తన పేరు మీద పట్టా చేయించకుండా, తన అన్నయ్య పేరు మీద పట్టా చేస్తూ తమ పెద్ద నాన్న వేధిస్తున్నాడని బాధితుడు అజయ్ రెడ్డి వాపోయాడు. భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న పెద్ద నాన్న తిరుపతి రెడ్డి తన చావుకు కారణమని తెలుపుతూ, పెద్ద నాన్న ఇంటి ముందే సేల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు  తాగుతుండడాన్ని గమనించిన స్థానికులు యువకుడు అజయ్ ని ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడనుండి మెరుగైన చికిత్స కోసం 108 లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

 

Tags: Selfie is a suicide attempt

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.