కరీంనగర్ లో సెల్ఫీ సూసైడ్ కలకలం

కరీంనగర్ ముచ్చట్లు:
 

కరీంనగర్ తిరుమలనగర్ లో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. నగరానికి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసాడు. తనకు చెందాల్సిన ఆస్తిని టీఆరెఎస్ నాయకుడుగా ఉన్న తన అన్న తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని మృతుడు పేర్కొన్నాడు. కరీంనగర్ లోని భగత్ నగర్ లోని ప్రాపర్టీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని శ్రీనివాసచారి వివరించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Selfie suicide scandal in Karimnagar

Natyam ad