సెల్ఫీ విత్ బెల్డ్ 

Date:23/02/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్  నగరంలో జరిగే రోడ్డుప్రమాదాల్లో 90శాతం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లేనని నివేదికలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాయి. మద్యం తాగి వాహనాలు నడపటం, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కారులో ప్రయాణించేవారికి సీటు బెల్టు ధరించడం తప్పనిసరి అని చాటిచెప్పేలా ఓ సంస్థ నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే ‘సెల్ఫీ విత్‌ సీట్‌ బెల్ట్‌’ ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టింది.కారు డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ ధరించి, ఫొటో దిగి హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే అతనికి బహుమతితో పాటు 5 లీటర్ల డీజిల్‌ని అందిస్తోంది ‘ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌’ (ఐఎఫ్‌ఏటీ) అనే సంస్థ. దీంతో వారం రోజులుగా వందలాది మంది క్యాబ్‌ డ్రైవర్లు ఇలా ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి బహుమతులు అందుకుంటున్నారు. ఈ ఛాలెంజ్ హైదరాబాదే కాకుండా దేశంలో వివిధ నగరాల్లో ట్రెండింగ‌గా మారినట్లు ఐఎఫ్‌ఏటీ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా భాగమైతే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; Selfie with Beld

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *