అర్బ‌న్ ఫ్ల‌డింగ్ పై స‌ద‌స్సు

Date:13/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
స‌రైన ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక‌లోపం, అప్ర‌తిహాతంగా పెరుగుతున్న న‌గ‌ర జ‌నాభా, నాలాలు, చెరువుల ఆక్ర‌మ‌ణ‌లు న‌గ‌రాల‌లో త‌ర‌చుగా ఏర్ప‌డే ముంపు స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణమ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్ర‌ణాళిక సంస్థ ఆధ్వ‌ర్యంలో నేడు అర్భ‌న్ ఫ్ల‌డింగ్ అనే అంశంపై వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, ముంబాయి ఐఐటి ప్రొఫెస‌ర్ కపిల్ గుప్తా, భార‌త వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ డా.వై.కె.రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్న ఈ స‌మావేశంలో ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌రావు మాట్లాడుతూ కేవ‌లం విప‌త్తుల స‌మ‌యాల్లో మాత్ర‌మే వాటి నివార‌ణ చ‌ర్య‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని అన్నారు. అర్భ‌న్ ఫ్ల‌డింగ్‌తో పాటు అన్ని ర‌కాల విప‌త్తుల‌కు శాశ్వ‌త ప‌రిష్కార మార్గాల‌ను చేప‌ట్టాల‌ని అన్నారు. ఈ ప్ర‌క్రియ‌లో భారీ మొత్తంలో నిధుల‌ను వెచ్చించాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని, ప్రాధాన్య‌త‌ల వారిగా ఈ ప‌నుల‌ను చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో నాలాల వెంట 28వేల‌ ఆక్ర‌మ‌ణ‌లు ఉన్నాయ‌ని, వీటిని తొల‌గించాలంటే సామాజిక‌, ఆర్థిక‌, శాంతి భ‌ద్ర‌త‌లు త‌దిత‌ర కోణాల నుండి చూడాల్సి ఉంటుంద‌ని అన్నారు. అయితే నాలాల‌పై అత్యంత కీల‌కంగా ఉన్న 47 అవ‌రోదాల‌ను రూ. 230 కోట్ల వ్య‌యంతో తొల‌గించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని, దీనిలో భాగంగా ప‌నులు కూడా ముమ్మరంగా జ‌రుగుతున్నాయ‌ని క‌మిష‌న‌ర్ వివ‌రించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తిరోజు క‌నీసం ఒక కోటి ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను ఉప‌యోగిస్తున్నార‌ని, వీటిలో దాదాపు 70శాతానికి పైగా ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క‌వ‌ర్లు నాలాల్లో వేయ‌డం ద్వారా వ‌ర్ష‌పునీరు పార‌కుండా వ‌ర‌ద‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద‌నీటి కాల్వ‌ల నిర్మాణానికి 12వేల కోట్ల రూపాయ‌లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అంచనా వేశామ‌ని అన్నారు. 400సంవ‌త్స‌రాల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన హైద‌రాబాద్ న‌గ‌రంలో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు స‌మ‌స్య‌గా మారాయ‌ని, వీటిని తొల‌గించి ప్రాసెస్ చేయ‌డానికి సీ అండ్ డి ప్లాంట్‌ను న‌గ‌రంలో ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో చెరువుగా ఉన్న ఏనుగుల కుంట చెరువును వెంగ‌ళ‌రావు పార్కుగా రూపొందించ‌డంతో వ‌ర్ష‌పునీటి నిల్వ‌కు ఆస్కారంలేకుండా ఉండి పంజాగుట్ట మోడ‌ల్ హౌజ్‌వ‌ద్ద చిన్న‌పాటి వ‌ర్షానికే జ‌ల‌మ‌యం అవుతుంద‌ని గుర్తుచేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వ‌చ్చిన మార్పుల ద్వారా భారీ వ‌ర్షాల ఆగ‌మ‌నాన్ని ముందుగానే తెలుసుకునే వీల‌వుతుంద‌ని, త‌ద్వారా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌కు కూడా అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ తెలియ‌జేశారు. హైద‌రాబాద్ న‌గరంలో నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి విస్త‌రించ‌డంలో భాగంగా చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో తొల‌గించిన పేద‌ల నివాసాల‌కు కూడా ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం అందిస్తుంద‌ని, అక్ర‌మ నిర్మాణాల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణే అని క‌మిష‌న‌ర్ గుర్తుచేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ను ఉటంకిస్తూ అర్బ‌న్ ఫ్ల‌డింగ్ అనే అంశంపై ముంబాయి ఐఐటి ప్రొఫెస‌ర్ క‌పిల్ గుప్తా ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్‌.కె.మీరా, అభిలాష్‌, డా.వై.కె.రెడ్డిలు త‌మ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.
అర్బ‌న్ ఫ్ల‌డింగ్ పై స‌ద‌స్సు  https://www.telugumuchatlu.com/seminar-on-urban-flooding/
Tags:Seminar on Urban Flooding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *