నాలుగు రోజుల పాటు మీ మనుమడిని సంక్షేమ హాస్టల్‌కి పంపు
బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్
హైదరాబాద్ ముచ్చట్లు:

బాసర ట్రిపుల్‌ఐటీ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారంతో పాటు కనీస వసతులు కల్పించడం లేదని ఈటల విమర్శించారు. ‘సీఎం మనుమడు ఏం తింటున్నారో అదే బువ్వ పెడుతున్నాం అనే మాటలు నిజమే అయితే .. నాలుగు రోజుల పాటు మీ మనుమడిని సంక్షేమ హాస్టల్‌కి పంపు.. అప్పుడు వారి బాధ మీకు తెలుస్తుంది’ అని అన్నారు. ఈ సమా వేశంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Send your grandson to a welfare hostel for four days
