ఏసీబీకి చిక్కిన అవినీతి ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్
ప్రకాశం ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా కంభం ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ పనిచేస్తున్న దూదేకుల నాసర్ వలి రూ.15 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. కంభం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి సంబంధించిన జీతాల అరియర్స్, బకాయిల బిల్లులు చేసేందుకు నాసర్ వలి 50 వేలు లంచం డిమాండ్ చేయడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు సాధారణ వ్యక్తుల్లాగా కార్యాలయంలోకి వెళ్లి లంచం తీసుకుంటుండగా హ్యండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
Tags; Senior Accountant of Treasury caught in ACB’s corruption

