Natyam ad

బోయకొండ అమ్మవారిని దర్శించుకున్న సీనియర్ సినీనటి రమాప్రభ

— అమ్మవారికి పూజలు చేసిన ప్రముఖులు
— మంత్రి పెద్దిరెడ్డికి అభినందనలు

చౌడేపల్లె ముచ్చట్లు:

Post Midle

సినీనటి రమాప్రభతో పాటు పలువురు ప్రముఖులు ఆదివారం కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మను దర్శించుకొన్నారు. ఆమెతో పాటు జానపథ కళల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ కొండ వీటి నాగభూషణం, డిఎఫ్‌ఓ చైతన్యకుమార్‌రెడ్డి కుటుంభీకులు అమ్మవారిని దర్శించుకొన్నారు. వీరిని ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజాకార్యక్రమాల అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. సినీ నటి రమా ప్రభ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిల ఆధ్వర్యంలో బోయకొండ ఊహించని రీతిలో ఆదర్శంగా అభివృద్దిచేయడం జరిగిందని పెద్దిరెడ్డి కుటుంభీకులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో బోయకొండను మరింత ప్రసిద్ది కెక్కిందన్నారు. అభివృద్దికి కృషిచేస్తున్న మంత్రికు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వీరి వెంట పాలకమండళి సభ్యురాలు ఈశ్వరమ్మ, లయన్స్క్లబ్‌ ప్రతినిధి వరదారెడ్డి, ఎఫ్‌ఈఎస్‌ పౌండేషన్‌ చైర్మన్‌ రెడ్డిరాణి, నిమ్మన పల్లె ఏపిఓ కె. రమేష్‌, సర్వేయర్‌ మురళీకృష్ణ తదితరులున్నారు.

 

Tags: Senior film actress Ramaprabha visited Mother Boyakonda

Post Midle