Natyam ad

భారత సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం 

అమరావతి ముచ్చట్లు:

ఇటీవల రహదారులపై జరుగుతున్న అనేక ప్రమాదాలపై భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులు మరియు జాతీయ రహదారులపై అదేవిధంగా వంతెనలపై ఎలాంటి దాన్యం ఆరబోసిన సంబంధిత రైతుపై కేసు నమోదు చేయడంతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది.సంబంధిత శాఖ ఈ జరిమానా విధిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆరపోసినధాన్యం వల్ల రోడ్డు ప్రమాదంలో వాహనదారులు ప్రమాదవశాత్తు మరణించిన. శాశ్వత అంగవైకల్యమైన. వాహనానికి సంబంధించిన బీమా డబ్బులు బాధిత వ్యక్తులకు అందజేయబడవు. ప్రమాదానికి కారకుడైన ధాన్యం ఆరబోసిన రైతు నుండి 10 లక్షల నుండి 20 లక్షల వరకు ఆస్తి జప్తి చేసి బాధిత ప్రమాద వ్యక్తులకు అందజేస్తారు. అన్నదాతలు ఇలాంటి ఇబ్బందులు కలిగే సంఘటనలకు కారణమైన రహదారులు జాతీయ రహదారులపై దాన్యం ఆరపోయకుండా జాగ్రత్తగా ఉండాలని భారత అత్యున్నత ధర్మాసనం అన్నదాతలకు సూచించింది. అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులకు ఈ సంఘటనలు తీవ్రమైన పరిణామాలని వీటిపై దృష్టి పెట్టకపోవడం శోచనీయమని అధికారులను మందలించింది.

 

Post Midle

Tags: Sensational decision of Supreme Court of India

Post Midle