విశాఖ పైన జగన్ ప్లాన్ వేరు..

Date:13/08/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:

అభివృధ్ధి విషయంలో జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఎంతసేపు అమరావతి అంటూ ప్రగతి అంతా విజయవాడ గుంటూరుకే పరిమితం చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. మొత్తం పదమూడు జిల్లాలు ఉంటే బాబు రెండు జిల్లాలు తప్పించి మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. . ఇక శ్రీకృష్ణ కమిషన్ చెప్పినా, విభజన చట్టంలో పెట్టినా కూడా ఏపీలో ఏడు జిల్లాలు వెనకబాటుతనానికి గురి అయ్యాయన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ ఏడు జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజ్ అవసరమని కూడా విభజన చట్టంలో ఉంది.

 

 

 

అయినా కేంద్ర పాలకులు సవతి ప్రేమ చూపారు. దానికి తగినట్లుగా ఏపీలో కూడా టీడీపీ సరేసరి. దీంతో అసమానతలపైన ప్రజలలో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. జగన్ మాత్రం వీటిని తన పాదయాత్ర ద్వారా పూర్తిగా దగ్గరగా చూశారు. అందువల్ల బాబు చేసిన తప్పు చేయకూడదు అనుకుంటున్నారు జగన్.ఈ మధ్య ముగిసిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సైతం రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విశాఖ గురించి పూర్తిగా అనుకూలంగా మాట్లాడారు. విశాఖలో అన్ని వనరులు ఉన్నా కూడా టీడీపీ సర్కార్ అయిదేళ్ళ కాలంలో ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. విభజన ఏపీలో ఐటీ పరంగా అభివృధ్ధి చెందగలిగే ఏకైన నగరంగా ఉన్న విశాఖను ఆ దిశగా ఎందుకు డెవలప్ చేయలేదని కూడా బాబును నిలదీశారు.

 

 

 

 

ఇక ఈ మధ్య విశాఖ వచ్చిన రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కూడా విశాఖను ఐటీ పరంగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. అదే విధంగా పారిశ్రామికంగా పెద్ద పీట వేస్తామని కూడా స్పష్టం చేశారు. అప్పట్లో వైఎస్సార్ తెచ్చిన ఐటీ కంపెనీలే విశాఖ రుషికొండ మీద ఇప్పటికీ కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా టీడీపీ చేసిందేమీ లేదని కూడా ఆయన అన్నారు.ఐటీ విషయంలో ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత స్థానంలో ఉండేది.

 

 

 

అప్పట్లో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు ఐటీకి సంబంధించి హైదరాబాద్ కే విశేష ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇపుడు విభజన తరువాత కూడా విశాఖను నాటి టీడీపీ సర్కార్ చిన్న చూపే చూసింది. దీంతో జగన్ విశాఖ విషయంలో ప్రత్యేకంగా శ్రధ్ధ తీసుకుంటున్నారు. విశాఖను మెట్రో సిటీగా అభివృధ్ధి చేస్తామని పెట్టుబడుల సదస్సులో జగన్ చేసిన ప్రకటనపై ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖను నంబర్ వన్ సిటీగా ఏపీలో చేయాలన్న ప్రణాళికలతో జగన్ ప్రభుత్వం ఉంది.

 

 

 

విశాఖకు వంద ఎలక్ట్రికల్ బస్సులు జగన్ సర్కార్ మంజూరు చేయడం విశేషం. ఇవి తొందరలోనే రోడ్డెక్కబోతున్నాయి. అలాగే విశాఖను టూరిజం హబ్ గా, సినీ రాజధానిగా కూడా చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ కి ఉత్తరాంధ్ర ప్రజలు నీరాజనం పట్టారు. దానికి గాను విశాఖను అభివృధ్ధి చేయడం ద్వారా ఈ మూడు జిల్లాలను ప్రగతిపధంలో తీసుకెళ్ళాలని వైసీపీ సర్కార్ ఆలోచనలు చేస్తోంది.

హ్యాట్రిక్ ప్లస్ 426 టార్గెట్

Tags: Separate pics plan on Vishakha ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *