పుంగనూరులో తడిచెత్త, పొడి చెత్తను వేరుచేయండి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోను ప్రజల వద్ద నుంచి తడిచెత్త, పొడి చెత్త, హానికారిక చెత్తను వేరుచేసి తరలిస్తున్నామని చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం మున్సిపాలిటిలోని ఏవి.రావువీధి, బ్రాహ్మణవీధి, ఎంబిటి రోడ్డు ప్రాంతాల్లో ఆయన కమిషనర్ రసూల్ఖాన్తో కలసి పారిశుద్ద్య కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటికి మూడు డస్టుబిన్నులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తడిచెత్త, పొడిచెత్త, హానికారిక చెత్తను వేరుచేసి కంపోస్టుయార్డుకు తరలిస్తున్నామన్నారు. హానికారిక చెత్తను శాయ పద్దతిలో నశింపచేసే కార్యక్రమం చేపట్టామన్నారు. స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Separate wet and dry garbage in Punganur