Separate wet and dry garbage

తడిచెత్తా, పొడిచెత్తను వేరుచేయాలి

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:20/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని 31 వార్డుల్లోను తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి, వాటిని కంపోస్ట్ యార్డులకు తరలిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం పట్టణంలోని చంద్రకాంత్‌వీధి, గోకుల్‌వీధి ప్రాంతాలలో తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసే విధానంపై ప్రజల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు తడిచెత్త, పొడిచెత్త, హాని కారిక చెత్తను వేరుచేసేందుకు ప్రతి ఇంటికి డస్ట్బిన్నులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రతి బుధ, శనివారాలలో పొడిచెత్తను సేకరించడం జరుగుతోందన్నారు. మిగిలిన రోజుల్లో తడిచెత్తను, హానికార చెత్తను వేరువేరుగా సేకరించి, కంపోస్ట్ యార్డులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రకాల చెత్తను విడివిడిగా ఇవ్వాలని, దీనిపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే హోం కంపోస్ట్ ద్వారా ఎరువును తయారు చేసి, ఆ ఎరువును విక్రయించుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పట్టణంలో హ్గం కంపోస్ట్ తయారీని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు, మేలు నాగయ్య, మురళికృష్ణారెడ్డి, మహిళలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

14 ఏళ్ల లోపు పిల్లలను పనులకు వినియోగించరాదు

Tags;Separate wet and dry garbage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *