సెరికల్చర్ రిటైర్డ్ సిబ్బంది వేడుకోలు

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ ను పట్టు పరిశ్రమ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీధర్ సందర్శించారు. సిరికల్చర్ డిపార్ట్ మెంట్ లో పదవి విరమణ పొందిన వారికి గత నాలుగేళ్లుగా పెన్షన్ రాకపోవడంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది అంటూ కమిషనర్ ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని మమ్మల్ని ఆదుకొని పెన్షన్ వచ్చే విధంగా సహరించాలి అని కమిషనర్ ను  కోరారు.  58 మంది రిటైర్డ్ ఉద్యోగులకు 2017 నుంచి పెన్షన్ అందక కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారిందని అన్నారు. తమతోపాటు పదవి విరమణ పొందిన కొంతమందైతే దేవాలయాల దగ్గర బస్టాండ్ దగ్గర బిక్షాటన చేసుకొని కుటుంబపోషణ చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అయితే కమిషనర్ వారి సమస్యలు పట్టు పట్టనట్లుగా వెళ్లిపోవడం పై వారు తీవ్రంగా దిగులు చెంది తమకు న్యాయం చేయాలని  కోరారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Sericulture Retired Staff Petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *