-భార్య, వ్యక్తిగత కార్యదర్శి మృతి
Date:11/01/2021
బెంగళూరు ముచ్చట్లు:
రక్షణ, ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కేంద్ర మంత్రి సతీమణి విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ ప్రాణాలు కోల్పోయారు. శ్రీపాద్ నాయక్ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో బోల్తాపడింది. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం కేంద్రమంత్రిని గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను ప్రధాని మోదీ కోరారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం సావంత్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. అవసరమైతే విమానంలో ఆయన్ను దిల్లీ తరలించాలని సూచించారు. ముఖ్యమంత్రి సావంత్ ఆస్పత్రికి వెళ్లి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అయితే శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయనకు ప్రాణాపాయం లేదని గోవా సీఎం పేర్కొన్నారు. ఆయనను దిల్లీ తరలించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Serious injuries to Union Minister in road accident