సర్పంచులు, ఉప సర్పంచులకు శిక్షణ ఇవ్వాలి

Date:12/01/2019
నల్లగొండ ముచ్చట్లు:
ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, గ్రామాలను అద్బుతంగా తీర్చిదిద్దే విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారు లను ఆదేశించారు. గ్రామాల్లో పచ్చ దనం, పరిశుభత్ర పెంచడం లక్ష్యంగా కొత్తగా రూపొందిచిన చట్టంపై పంచా యితీలకు అవగాహన కల్పించాలని, ప్రతీ గామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగు ప్రతులను పంపించాలని చెప్పారు. కొత్తగా నియామకమయ్యే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసికట్టుగా పనిచేయడానికి అవ సరమైన అవగాహన కల్పించాలని చెప్పారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పం చులు మూస పద్ధతిలో కాకుండా, గ్రామాల సమగ్ర వికాసానికి పాటు పాడే ఉద్యమ కారులుగా మారాలని సిఎం ఆకాంక్షించారు.
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, కాలె యాదయ్య, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించడం కోసం పంచాయతీ కార్యదర్శులు నియామకం కూడా జరుగుతున్నది. గ్రామాభివ ద్ధిలో వీరిద్దరి పాత్ర చాలా కీలకం. గ్రామ పంచాయితీకు విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత జాప్యం అనివార్యమవుతుంది.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ను పొయ్యే అవకాశం ఉన్నందున రాష్ర్ట ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ కే పోతుంది. ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతాం. ఆ బడ్జెట్లోనే పంచాయితీలకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుంది. ఆ లోగా సర్పంచులు, కార్యదర్శులకు పూర్థి స్థాయిలో శిక్షణ ఇచ్చి, గ్రామాభివద్ధి కోసం పాటు పడే కార్యకర్తలుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ గ్రామీణాభివ ద్ధి సంస్థ, ఆస్కి, ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. తదితర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలి’’ అని సిఎం కోరారు.
Tags:Serpents and sub-serpents should be trained

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *