ప్ర‌సాదాల పోటులో కార్మికుల‌పై వేడినీరు

Date:24/10/2020

తిరుమ‌ల ముచ్చట్లు:

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని ప్ర‌సాదాల పోటులో శ‌నివారం అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి చింత‌పండు క‌లిపిన నీటిని ఉడికించే పాత్రపై మూత ఊడి ఐదుగురు పోటు కార్మికుల‌పై వేడి నీరు పడింది. ఈ సంఘ‌ట‌న‌లో ఇద్దరికి ఒంటిమీద బొబ్బ‌లు రావ‌డంతో అశ్విని ఆసుప‌త్రికి త‌రలించారు. అక్క‌డ వైద్యులు ప్ర‌థ‌మ చికిత్స చేసి పంపారు. ఈ సంఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని వైద్యులు తెలిపారు. పోటు కార్మికుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అశ్విని ఆసుప‌త్రిలో ప‌రామ‌ర్శించారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags: Service to the Swami’s Pallaki of Sri Venkateswara who slept

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *