కనువిందు చేసిన శ్రీ వేంకటేశ్వరుని స్వామివారి పల్లకి సేవ

-ఆనందోత్సాహాలతో పురవీధుల్లో శ్రీనివాసుడు
-భజన, భక్తి గీతాలతో  తిరుమలేశుని పల్లకి సేవ

Date:24/10/2020

కౌతాళం  ముచ్చట్లు:

కనువిందు చేసిన శ్రీ వేంకటేశ్వరుని స్వామివారి పల్లకి సేవ, ఆనందోత్సాహాలతో పురవీధుల్లో శ్రీనివాసుడు. పల్లకి ని పూలమాలలు వేసి అలరించారు.మండల కేంద్రం వెలసిన ,వేంకటేశ్వరుని ఆలయంలో నవరాత్రులు 8 వ రోజు సందర్భంగా ఉదయం నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు సుబ్బన్న స్వామి నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీనివాసుడు ఆ వెంటేశ్వర స్వామి వారికి పంచామృతం, పాలు, పెరుగు పన్నీరు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయ అధికారులు, స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పురవీధుల్లో ఆ శ్రీనివాసుని పల్లకి సేవ నిర్వహించారు. పురవీధుల్లో భక్తులు గ్రామ ప్రజలు బారి సంఖ్యలో  టెంకాయ, నైవేద్యాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నరు.శ్రీనివాసుని పల్లకి సేవల్లో భక్త జన మండలి పాల్గొని భజనలు, భక్తి గీతాలు గ్రామ ప్రజలను అలరించాయి. అనంతరం ఆలయంలోకి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. దర్శించుకున్న భక్తులకు ఫలహారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గురు రెడ్డి, నరసింహ రెడ్డి, శశి రెడ్డి భక్త జన మండలి సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags:Service to the Swami’s Pallaki of Sri Venkateswara who slept

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *