Services in village secretaries

గ్రామ సచివాలయాలలోనే సేవలు

Date:05/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు గ్రామ సచివాలయాలలోనే ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుందని ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు .శుక్రవారం మండలంలో సచివాలయ ఉద్యోగుల రెండవ రోజు శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు 27 శాఖలకు చెందిన 512 సేవలను సచివాలయాలలో అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు సచివాలయానికి వచ్చిన సమయంలో అధికారులు చిరునవ్వుతో పలుకరించి , ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ధృవపత్రాలు నిర్ణీత గడువులో పంపిణీ చేయాలని , ప్రజలకు అందుబాటులో ఉంటు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి పేరు తీసుకొచ్చేలా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డియాదవ్‌ పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత

Tags: Services in village secretaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *