హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట

అమరావతి ముచ్చట్లు:
 
హైకోర్టు లో రేషన్ డీలర్లకు ఊరటనిచ్చింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచింది. రేషన్ డీలర్లు దశాబ్దాలుగా కమిషన్ తో పాటు, గోనె సంచుల ద్వారా ఆదాయం పొందుతున్నారు. తాజాగా గోనె సంచులుకు డబ్బులు ఇచ్చేది లేదంటూ అధికారుల ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. నష్టపోతామని డీలర్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని వారి ఆరోపణ. దాంతో ఎపి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మండాది వెంకట్రావు, మధు, శివప్రసాద్ హైకోర్టు ను ఆశ్రయించారు.  డీలర్ల తరపున హైకోర్టు లో న్యాయావాది శ్రీనివాసరావు  వాదనలు వినిపించారు. గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒక్కో సంచికి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Session for ration dealers in the High Court