Natyam ad

స్మశానానికి స్థలం కేటాయించండి

రామసముద్రం ముచ్చట్లు:

తమకు స్మశానవాటికకు స్థలము కేటాయించాలని మరాఠా లు సోమవారం తహశీల్దార్ శాస్త్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామసముద్రంలో దాదాపు 20 కుటుంబాలు గత 200 సంవత్సరాలు గా జీవిస్తున్నామన్నారు. పూర్వీకులు కాలం నుండి రామసముద్రం మండల కేంద్రము లో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమ కుటుంబా ల్లో ఎవరైనా మరణిస్తే పుంగనూరు రోడ్డు, సబ్ స్టేషన్ ఎదురుగా ప్రభుత్వ స్థలం లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామన్నారు. తమపై దయతలచి మా కుటుంబాలల్లో మరణించే వారికీ అంత్యక్రియలు నిర్వహణకు సరిపోవు ప్రభుత్వ స్థలము కేటాయించి హద్దులు చూపించాలని తహాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మరాఠా రాష్ట్ర నాయకులు పవార్ రెడ్డి వినోద్, మండల నాయకులు పవార్ మంజునాథ్, శివనాథ్ రావు, జగదీష్, శ్రీనివాస్ రావు, లక్ష్మణ్ రావు మూర్తి, పద్మావతి, ప్రభవతి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Set aside a place for a cemetery

Post Midle