Set up a free eye medical camp at Gutti Erragudi village

గుత్తి ఎర్రగుడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

Date:17/10/2020

తుగ్గలి ముచ్చట్లు

తుగ్గలి మండల పరిధిలోని గల గుత్తి ఎర్రగుడి గ్రామంలో ఆరోగ్య సేవా సంస్థ వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శనివారం రోజున ఎర్రగుడి గ్రామంలో ఆరోగ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో కోడుమూరు విశ్వ భారతి హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ జిట్టా లక్ష్మీదేవి మరియు వైసీపీ మండల కన్వీనర్ జిట్టా నాగేష్ లు ప్రారంభించారు.విశ్వ భారతి హాస్పిటల్ డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో 200 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఉచితంగా కంటి వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా పంపిణీ చేశారు.వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో 25 మందికి కంటి ఆపరేషన్ల ను ఉచితంగా నిర్వహిస్తామని ఆరోగ్య సేవా సంస్థ సింహ వీరన్న మరియు సింహ అనూ లు తెలియజేశారు.ఆరోగ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వైసిపి నాయకులు జిట్టా నాగేష్ మరియు గ్రామ పెద్దలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విశ్వ భారతి హాస్పిటల్ సిబ్బంది,ఆరోగ్య సేవా సంస్థ సింహ వీరన్న,సింహ అను,రమేష్,గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

 

భారత్ లో క్రమంగా తగ్గుతూ వస్తున్న కరోనా మహమ్మారి జోరు 

Tags:Set up a free eye medical camp at Gutti Erragudi village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *