మంత్రాలయంలో  పునరావాస కేంద్రం ఏర్పాటు.    

–  సౌకర్యాల కొరత లేకుండా చూడండి.
-ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి

Date:30/03/2020

మంత్రాలయం ముచ్చట్లు:

వివిధ ప్రాంతాల నుండి పునరావాస కేంద్రాల్లో వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ,ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని దుర్గా రమణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్  మంత్రాలయంలో  డీవీజీ  వంద  గదుల సముదాయాన్ని  పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు  అధికారులు  ఆదివారం  పీఠాధిపతుల వారిని సంప్రదించగా  పీఠాధిపతులు  డివిజి వంద రూముల సముదాయాన్ని  పునరావాస కేంద్రానికి ఇవ్వడానికి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు.

 

 

 

పీఠాధిపతులు  కలెక్టర్ ఆదేశాలను  తోసిపుచ్చడంతో  అధికారులు  భూరమణ కల్యాణ మంటపాన్ని  పునరావాస కేంద్రంగా  ఏర్పాటు చేశారు. యంఎల్ ఏ ,ప్రధీప్ రెడ్డి  సోమవారం తహసీల్దార్ చంద్ర శేఖర్, సీఐ కృష్ణయ్య, డాక్టర్ సుబ్బరాయుడితో కలిసి సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. కేవలం ఇతర ప్రాంతాల వారికి మాత్రమే పునరావాస కేంద్రంలో స్తానం కల్పించాలని ,వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

 

 

ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలోని లాడ్జి యజమానులు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా అధికారులకు సహకరించాలని చేతులెత్తి నమస్కరించి కోరారు. ఈయనతో పాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి, మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి,  టి.భీమయ్య, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, ఎస్ఐ లు వేణుగోపాల్ రాజ్, బాబు, ఎర్రన్న తదితరులు ఉన్నారు.

 కరోనా నియంత్రణలో తెలంగాణ బెస్ట్

Tags: Setting up a rehabilitation center in Mantralayam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *