పుంగనూరులో సేవ వజ్ర, రత్న వలంటీర్లు
పుంగనూరు ముచ్చట్లు:
సచివాలయ వ్యవస్థలో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ప్రభుత్వం సేవ వజ్ర, సేవ రత్న , సేవ మిత్ర అవార్డులకు ఎంపిక చేసింది. వజ్ర అవార్డుకు రూ.30 వేలు, రత్న అవార్డుకు రూ.20 వేలు , మిత్రకు రూ.10 వేలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటి పరిధిలో ఇద్దరిని సేవ వజ్ర కు ఎంపికైనట్లు కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. తేరువీధికి చెందిన అంజాద్‌అలీషేక్, కొత్తయిండ్లుకు చెందిన వన్యలను వజ్ర అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే సేవరత్న అవార్డులకు కొత్తయిండ్లు-2 సచివాలయానికి చెందిన శశికళ, గోకుల్‌వీధికి చెందిన రిజ్వానబేగం, తూర్పువెహోగశాల-2కు చెందిన మౌనిక, బీడికాలనీకి చెందిన రఫి, భగత్‌సింగ్‌కాలనీకి చెందిన చిరంజీవిలు ఎంపికైయ్యారన్నారు. మండలంలో సేవరత్న అవార్డులు 5 మందికి లభించింది. వీరిలో రాగానిపల్లెకి చెందిన ఆనంద, సింగిరిగుంటకు చెందిన గీత, చదళ్లకు చెందిన హేమలత, చండ్రమాకులపల్లెకి చెందిన మణికుమారి, వనమలదిన్నెకి చెందిన శ్రీమతి ఉన్నారు. వీరిని పలువురు అభినందించారు.

Tags; Seva Vajra, Ratna Volunteers in Punganur
