ధరలు తగ్గించాలని సేవాదళ్ ధర్నా

హైదరాబాద్ ముచ్చట్లు:
పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం రామ్ నగర్ లో రాస్తారోకో చేపట్టిన కార్యకర్తలు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు సురేష్, విజయ్ యాదవ్, తేజ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ మాట్లాడుతూ మోదీ సర్కార్ ఏడేళ్ల  నుండి అనేక సార్లు పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతుందని దీని వల్ల సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. రోజుకు 30  పైసల 20 పైసల చొప్పున పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతూ 107 రూపాయలకు వరల్డ్ రికార్డు స్థాయికి ధరలు పెరిగిన ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం దుర్మార్గమని ప్రజల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Sevadal dharna to reduce prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *