హత్యకేసులో ఏడుగురు ఆరెస్టు

విజయవాడ  ముచ్చట్లు:
నగరంలో సంచలనం కలిగించిన హత్య కేసులో ఏడుగురు అరెస్టు అయ్యారు. డీసీపీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ దుర్గా అగ్రహారం లో హత్య జరిగింది. కండ్రిగ కు చెందిన రామారావుగా మృతుడిని గుర్తించాం. సాంకేతిక ఆధారాలతో ఏడుగురిని అరెస్టు చేసాం. గత నెల 16న ఒక ప్రేమ పంచాయితీ జరిగింది. మైనర్ బాలిక బాబాయి మురళి పంచాయితీ చేసారు. కొరుకూరి రవీంద్ర రెండు సార్లు రామారావుకి ఫోన్ చేసి బెదిరించాడు. రామారావు తనను చంపేస్తాడని భయంతో హత్య చేసారని అయన అన్నారు. నిందితులు ఏడుగురిపై పాత కేసులు ఉన్నాయి. కోతల శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్, కరీం, మురళి, వినయ్ కుమార్, నిహాంత్ లను రిమాండ్ కు పంపాం. ఒక వారం రౌడీ షీటర్లు కోతల శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు. తదుపరి విచారణలో ఇంకెవరైనా ఉన్నారా అనేది తేలుతుంది. ఇప్పుడు అరెస్టు అయిన వారిపైన కూడా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని అయన అన్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Seven arrested in murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *