Natyam ad

ఎర్ర చందనం కేసులో ఏడుగురు అరెస్ట్

–రూ:12:51 లక్షల విలువగల కలపస్వాధీనం
— రిమాండుకు ఆదేశించిన న్యాయమూర్తి

చౌడేపల్లె ముచ్చట్లు:


ఎర్రచందనం కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి. మధుసూధనరెడ్డి తెలిపారు. శనివారం చౌడేపల్లె పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఎస్‌ఐ రవికుమార్‌ తో కలిసి అరెస్ట్ వివరాలను సీఐ వెల్లడించారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి….చౌడేపల్లె మండలంలోని 29 ఏ చింతమాకులపల్లె పంచాయతీ బయ్యపల్లెకు చెందిన ఆర్‌. భాస్కర్‌ రెడ్డి తన పొలంలో పెంచుకొన్న రెండు ఎర్రచందనం చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారని ఈనెల 6వతేది గురువారం పోలీసులకు ఫిర్యాధుచేశారన్నారు. రహస్య సమాచారం మేరకు బయ్యప్పల్లె గ్రామానికి సమీపంలోని రామచంద్రారెడ్డి కు చెందిన మామిడితోపులో ఎర్రచందనం దుంగలు పై ఉన్న బెరడును తీస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ఎస్‌ఐ రవికుమార్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఏడు మందిని అదుపులోకి తీసుకొన్నారు. బయ్యపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, శశిధర్‌,నాగభూషణం, గంగాధరం,పుంగనూరు మండలం ఆరడిగుంటకు పంచాయతీ అలజనేరుకు చెందిన కళ్యాణ్‌కుమార్‌,సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు చెందిన నాగరాజ, మధు లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద గల ఎనిమిది ఎర్రచందనం కొయ్యలు, వీటి విలువ సుమారు 314 కే జీలు కలదన్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం రూ:12.51 లక్షల కలదన్నారు. వీటితో పాటు రంపం, కొడ్డలి తదితర సామాగ్రిను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అరెస్ట్చేసి పుంగనూరు కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును చేధించిన ఎస్‌ఐ రవికుమార్‌, సిబ్బందిని సీఐ అభినందించారు.

 

Post Midle

Tags: Seven arrested in red sandalwood case

Post Midle