యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న ఏడు చేపల కధ

Seven fish story shaking youtube

Seven fish story shaking youtube

Date:24/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఏడు చేపల కథ.. ఇటీవల విడుదలైన ఈ మూవీ బోల్డ్ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ మిలయన్ల వ్యూస్‌ని రాబట్టింది. అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్ జె చైతన్య దర్శకత్వం వహించారు. ఏడుగురు హీరోయిన్లని ఏడు చేపలుగా చూపిస్తూ కట్ చేసిన టీజర్‌‌ అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలతో పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. దీంతో ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఒక్క టీజర్‌తో ఏడు చేపల కథకు బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ఈ ఏడు చేపల కథలో ఒక చేప అయిన మేఘనా నాయుడు ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆనందాన్ని కలిగించింది అంటుంది మేఘనా నాయుడు. టీజర్ చూసి ఉర్రూతలూగుతున్న యూత్‌ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్లని ఉర్రూతలూగించేటందుకే తాను కష్టపడుతున్నా అన్నారు. ఈ సినిమాలో ఏడు చేపల్లో నేను ఓ చేపని.
అబ్బాయిల వల్ల అమ్మాయిలు ఎలా నష్టపోతున్నారో.. అమ్మాయిల వల్ల అబ్బాయిలు కూడా మోసపోతున్నారు అనే మెసేజ్‌ను నా పాత్ర ద్వారా చూపించబోతున్నారు. బోల్డ్ పాత్రల ద్వారా మంచి మేసేజ్ ఇవ్వబోతున్నాం. నేను ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించానంటే నాకు అవకాశాలు లేక కాదు. నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్‌కి కాంప్రమైజ్ కాను. ఏడు చేపల కథలో బోల్డ్ పాత్రలో నటించాను అంటే నాకు పాత్ర నచ్చింది. అందుకే నేను చేశా. ఒకవేళ నాకు డ్రెడిషన్ పాత్ర వచ్చినా పాత్ర నచ్చితే నేను చేస్తా. ఎలాంటి పాత్రనైనా చేస్తా. నాకు ఇచ్చిన పాత్రను గౌరవిస్తా. ఏ పాత్ర అయినా ఇన్వాల్వ్‌మెంట్ కావడం ముఖ్యం. ఈ సినిమాలో నా పాత్ర అలా చేస్తేనే న్యాయం చేయగలం. మనం పనిచేయడానికి వెళ్లాం. అది చేయాలి. నేనూ అమ్మాయినే నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. షూటింగ్ సమయంలో చుట్టు చాలా మంది ఉంటారు. అయినా సరే అలా చేయడానికి ఇష్టపడ్డాం ఆ పాత్రను ఎంజాయ్ చేశాను కాబట్టే.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడగడం కామనే. ప్రాజెక్ట్స్ చేస్తన్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు. ఈ రెండున్నరేళ్లలో ఎంతమంది అడిగారంటే చెప్పలేను. ఇప్పటికీ అలాంటివి ఉన్నాయి. అయితే అవతల వాళ్లు మన నుండి దాన్ని ఆశిస్తున్నారంటే ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ అనుకుంటే చేసేది ఏం ఉండదు. లొంగిపోయి చేయాలని అనేది ఏం ఉండదు. ఇది సినిమా ఇండస్ట్రీలోనూ కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. అయితే హీరోయిన్స్‌ని మాత్రమే కమిట్మెంట్ గురించి అడుగుతారు. మిగితా రంగాల వాళ్లని అడగలేరు.
నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యాన్స్ అందరూ బాయ్ ఫ్రెండ్సే. మా పేరెంట్స్ ఈ టీజర్ చూసి ఇబ్బంది పడిన మాట వాస్తవమే. స్టోరీ పరంగా ఇలా చేయాల్సివచ్చిందని చెప్పా. అయితే ప్రతి ప్రాజెక్ట్ కోసం ఇంట్లో వాళ్లకి చెప్తా. కాని సీన్ సీన్ వాళ్లకి చెప్పలేం. కదా అన్నారు మేఘనా చౌదరి.
Tags:Seven fish story shaking youtube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *