అందరిని చల్లగా చూడు ఏడు కొండలవాడా..

Date:12/12/2019

కొల్లాపూర్ ముచ్చట్లు:

ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో జీవించే టట్లు చల్లగా చూడాలని శ్రీ వేంకటేశ్వరుని కి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సతీమణి బీరం విజయమ్మ శ్రీ వేంకటేశ్వరుని వేడుకొన్నారు. కోల్లాపూర్ మండలం లోని రామాపూర్ గ్రామం వెలుపల గుట్ట పై వెలిసిన శ్రీ అలువేలుమంగ సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరుని గురువారం జరిగిన కళ్యాణోత్సవం లో ఆమె పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.ప్రజలందరు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల తో చల్ల గా జీవించేటట్లు చూడాలని స్వామి వారిని మొక్కున్నట్లు బీరం విజయమ్మ తెలిపారు.స్వామి వారి కళ్యాణోత్సవం చూచేందుకు వచ్చిన వివిధ గ్రామాల భక్తులను ఆమె పలకరిస్తూ వారి యోగ క్షేమాలు తెలుసుకొన్నారు.ఎమ్మెల్యే సతీమణి విజయమ్మ వెంట మాపూర్ సర్పంచ్ భారతి,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

కన్నుల పండుగగా  “వేంకటేశ్వరుని కళ్యాణం”…

 

Tags:Seven hills of cool ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *