పట్టాలు తప్పిన రైలు… ఏడుగురు మృతి

Seven killed by rails ...

Seven killed by rails ...

Date:10/10/2018
లక్నో  ముచ్చట్లు:
ఉత్తరప్రదేశ్‌లో బుదవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదం లో ఏడుగురు మృతి చెందగా 20 మందికిపైగా గాయపడ్డారు. రాయ్‌బరేలి జిల్లా హర్‌చంద్‌పూర్‌ సమీపంలో న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు ఈ ఉదయం 6.05 గంటలకు పట్టాలు తప్పాయి. రైలు పశ్చిమ్‌బంగలోని మాల్దా నుంచి దిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే లఖ్‌నవూ, వారణాసి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయి. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Tags:Seven killed by rails …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *